దూసుకుపోయిన మార్కెట్లు.. భారీ లాభాలు

27-05-2020 Wed 17:22
  • 996 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 286 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 13 శాతం పైగా లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్
Sensex ends 996 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు దూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 996 పాయింట్ల లాభంతో 31,605కి పెరిగింది. నిఫ్టీ 286 పాయింట్లు పుంజుకుని 9,315కి ఎగబాకింది. హెల్త్ కేర్ మినహా అన్ని సూచీలు ఈరోజు లాభాల్లోనే ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (13.46%), ఐసీఐసీఐ బ్యాంక్ (8.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (5.91%), బజాజ్ ఫైనాన్స్ (5.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.83%),    

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.85%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.42%), టైటాన్ కంపెనీ (-0.71%), ఏసియన్ పెయింట్స్ (-0.62%), మారుతి సుజుకి (-0.10%).