పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. కానీ, మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారు: డాక్టర్ సుధాకర్ లేఖ

27-05-2020 Wed 17:09
  • మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాసిన డాక్టర్ సుధాకర్
  • తనకు ఏ రోజు ఏ మందులు ఇస్తున్నారో వివరణ
  • మరో ఆసుపత్రికి రెఫర్ చేయాలంటూ విజ్ఞప్తి
Doctor Sudhakar writes letter to Visakha Mental Hospital Superintendent

విశాఖ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని డాక్టర్ సుధాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చిందీ ఆ లేఖలో వివరంగా పేర్కొనడం గమనార్హం. తనకు ఇస్తున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వాపోయిన డాక్టర్ సుధాకర్.. పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ తీసిన ఫొటోను లేఖకు జతచేశారు. తనను వెంటనే మరో ఆసుపత్రికి రెఫర్ చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. మాస్కుల వివాదం సహా అన్ని విషయాలను ఆ లేఖలో సవివరంగా రాసుకొచ్చారు.