చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ పిటిషన్.. రేపు విచారిస్తామన్న హైకోర్టు

27-05-2020 Wed 16:21
  • రెండు నెలల తర్వాత ఏపీకి వెళ్లిన చంద్రబాబు
  • పలుచోట్ల స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
  • లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో పిల్
High Court hears arguments on Chandrababu Lockdown violation petetion

టీడీపీ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిల్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారించింది. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? అని ఫిర్యాదుదారును హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసునే హైకోర్టు ఇప్పటికే స్వీకరించిందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, ఆ ఐదుగురు ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్రబాబు కేసును కూడా రేపు విచారిస్తామని తెలిపింది.

దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఆయనకు టీడీపీ జెండాలతో స్వాగతం పలికారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ ఆయనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.