చక్రి మరణం బాధాకరం: జనసేన కార్యకర్త మృతిపై పవన్ కల్యాణ్

27-05-2020 Wed 16:07
  • రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన జనసైనికుడు చక్రి
  • పార్టీకి చక్రి చేసిన సేవలు మరువలేనివన్న పవన్
  • బాధాతప్త హృదయంతో నివాళి అర్పిస్తున్నాం
Chakris death is very sad says Pawan Kalyan

కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త బొమ్మదేవర చక్రి ఈ ఉదయం కొండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. నిస్వార్థ జనసైనికుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. చక్రి మరణం చాలా బాధాకరమని తెలిపారు. బాధాతప్త హృదయంతో చక్రికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని... కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.