కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై సినీ నటి ఫిర్యాదు.. అరెస్ట్ చేసిన పోలీసులు

27-05-2020 Wed 14:13
  • శ్యామ్ కె నాయుడుపై నటి సుధ కేసు
  • అదుపులోకి తీసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు
  • ఉలిక్కి పడిన టాలీవుడ్
Actress Sudha complaints against camera man Shyam K Naidu

టాలీవుడ్ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడంటూ సినీ నటి సాయి సుధ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు  వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించారు. శ్యామ్ కె నాయుడిపై కేసు నమోదు కావడంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది.