త్రిష వివాదాస్పద పోస్ట్.. రానా గురించేనంటూ చర్చ!

27-05-2020 Wed 12:27
  • కామెంట్లు రావడంతో పోస్ట్‌ను డిలీట్ చేసిన త్రిష
  • అప్పటికే స్క్రీన్ షాట్‌లు తీసిపెట్టుకున్న నెటిజన్లు
  • ఇటీవలే రానాకు కుదిరిన పెళ్లి
trisha about rana

సినీనటుడు దగ్గుబాటి రానా తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన హీరోయిన్ త్రిషతో డేటింగ్ చేశాడని ప్రచారం జరిగింది. కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. ఇప్పుడు మిహీకాను తాను పెళ్లి చేసుకోనున్నట్లు రానా ప్రకటించిన నేపథ్యంలో తాజాగా హీరోయిన్ త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ వైరల్ అవుతోంది.
           
ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగిస్తారో వారు అహంకారులని ఓ పరిశోధనలో తేలిందంటూ వచ్చిన వార్తను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం తనకు ముందే తెలుసని ఆమె కామెంట్ చేసింది. ఆమె రానా గురించే ఈ కామెంట్ చేసిందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో ఆమె ఈ పోస్ట్ ను డిలీట్ చేసింది. అప్పటికే కొందరు ఆమె చేసిన వ్యాఖ్యను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు.