ప్రమాణ స్వీకారం నాడే జగన్ మీడియాను బెదిరించారు: వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ

27-05-2020 Wed 10:26
  • తమపై వార్తలు రాస్తే కోర్టుకీడుస్తామన్నారు
  • నేడు దిగజారిపోయాయంటూ వ్యాఖ్యలు చేశారు
  • న్యాయ, మీడియా వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు
  • మరి మీ పత్రిక, ఛానల్ పై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి  
devineni fires on ycp

మీడియాపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ కనబరుస్తోన్న తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మాపై వార్తలు రాస్తే కోర్టుకీడుస్తామంటూ ప్రమాణ స్వీకారంనాడే మీడియాను బెదిరించారు. నేడు దిగజారిపోయాయంటూ వ్యాఖ్యలు చేశారు. న్యాయ, మీడియా వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లు విలువలు లేకుండా టీడీపీ ప్రభుత్వంపై రాసిన మీ పత్రిక, ఛానల్ పై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి జగన్ గారు' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా గతంలో జగన్ మాట్లాడిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. మీడియాలో తమ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తామని, కోర్టుకెళతామని జగన్ అందులో చెప్పారు.