Donald Trump: ట్రంప్‌ చేసిన ట్వీట్లపై ట్విట్ట‌ర్ హెచ్చరిక.. మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు

  • ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ల‌తో ఫ్రాడ్ జ‌రుగుతుంద‌న్న ట్రంప్
  • ట్వీట్లు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ట్విట్టర్‌ వార్నింగ్‌
  • భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డ‌మేనన్న ట్రంప్
  • అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ జోక్యం చేసుకుంటోందంటూ ఆగ్రహం
trump tweets

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చేసిన ట్వీట్లు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఆయనకు తొలిసారి ట్విట్ట‌ర్ 'ఫ్యాక్ట్‌ చెక్'‌ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ల‌తో ఫ్రాడ్ జ‌రుగుతుంద‌ని తాజాగా ట్రంప్ రెండు ట్వీట్లు చేశారు. అయితే, ఆ ట్వీట్లపై‌ ట్విట్ట‌ర్ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

                         
   
ఆ రెండు ట్వీట్లకు ట్విట్టర్‌ వార్నింగ్ లేబుల్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ట్వీట్ల కింద ఈ బ్లూమార్క్ వార్నింగ్‌ను గుర్తించవచ్చు. నిజాలు తెలుసుకుని ట్వీట్లు చేయాలని ఆ హెచ్చ‌రిక‌ల్లో ట్విట్టర్ పేర్కొంది. తమ సైట్‌లో  ఎవ‌రైనా అసత్య స‌మాచారం పోస్టు చేస్తే అటువంటి వారికి వార్నింగ్ ఇచ్చే విధంగా ట్విట్ట‌ర్ ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

సాధారణ ట్విట్టర్ ఖాతాదారులకు మాత్రమే కొన్ని రోజులుగా వార్నింగ్ ఇస్తోన్న ట్విట్టర్ ఇప్పుడు ట్రంప్‌కి కూడా హెచ్చరిక చేయడం గమనార్హం. ట్విట్ట‌ర్ నుంచి వచ్చిన హెచ్చరిక పట్ల ట్రంప్ స్పందించారు. ఇలా ట్విట్టర్ వార్నింగ్ ఇవ్వడం భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డ‌మేనని అన్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ జోక్యం చేసుకుంటోందంటూ మండిపడ్డారు.

More Telugu News