ఈ 'చుంగూ ముంగూ' నన్నేమీ చేయలేవు... అమితాబ్ కు రామ్ గోపాల్ వర్మ రిప్లయ్!

27-05-2020 Wed 09:50
  • వర్మ రూపొందించిన 'కరోనా వైరస్' 
  • ట్రయిలర్ పై స్పందించిన అమితాబ్
  • వైరస్ తనను లాక్ డౌన్ చేయలేదన్న వర్మ
Amitab and Varma Twitter Comments Goes Viral

లాక్ డౌన్ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'కరోనా వైరస్' చిత్రం ట్రయిలర్ విడుదల కాగా, దీనిపై అమితాబ్, వర్మల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్రయిలర్ ను చూసిన అమితాబ్, "అణగదొక్కేందుకు వీలులేని రామ్ గోపాల్ వర్మ... చాలా మందికి 'రాము', నాకు మాత్రం 'సర్కార్'. లాక్ డౌన్ వేళ, ఆయన ఓ కుటుంబం గురించి మొత్తం సినిమాను తీశారు. దాని పేరు 'కరోనా వైరస్' వైరస్ పై తీసిన తొలి చిత్రం ఇదేనని భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.

ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, "థాంక్స్ సర్కార్... ఇలాంటి చుంగూ ముంగూ వైరస్ లు నన్ను లాక్ డౌన్ చేయలేవు" అని అన్నారు.