వర్కౌట్స్ చేస్తుండగా తమిళ హీరో సూర్యకు గాయం... చిన్న దెబ్బేనని వివరణ!

27-05-2020 Wed 09:08
  •  నిర్ధారించిన బంధువులు
  • ఎడమ చేతికి గాయం
  • 90 శాతం నయమయిందని బంధువుల వెల్లడి
Tamil Star Hero Surya Suffering from Injury

తమిళ స్టార్ హీరో సూర్య వర్కౌట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని నిర్ధారించిన సూర్య బంధు వర్గాలు, వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్నారని, గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా అదేమీ పెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు.

 కాగా, సూర్యకు గాయాలైనట్టు వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ పూజలు చేశారు. ప్రస్తుతం ఆయన హరి దర్శకత్వంలో 'అరువా' చిత్రంలో నటిస్తుండగా, లాక్ డౌన్ ముగిసిన తరువాత సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.