India: విదేశాల నుంచి వచ్చిన తబ్లిగి కార్యకర్తలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు... హైకోర్టుకు విన్నవించిన ఢిల్లీ పోలీసులు!

  • టూరిస్ట్ వీసాలపై వచ్చి నిబంధనల ఉల్లంఘన
  • ఇండియన్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం నేరస్థులే
  • 960 మందికీ జైలు శిక్ష విధించవచ్చన్న పోలీసులు
960 Tabligi Jamat Foreigners Can be Jailed for 5 Years

వివిధ దేశాల నుంచి ఇండియాకు టూరిస్ట్, ఈ- వీసాలపై వచ్చిన దాదాపు 960 మంది, వీసా నిబంధనలను ఉల్లంఘించి, ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారని, వీరికి ఐదు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించవచ్చని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విదేశీయులను విడిచి పెట్టాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించగా, పోలీసులు తమ వాదనను వినిపించారు.

వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారేనని, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, దేశంలో కరోనా వ్యాప్తికి కారకులయ్యారని, వీరు ఇండియన్ ఫారినర్స్ యాక్ట్, సెక్షన్ 14 ప్రకారం నేరస్తులేనని తెలిపారు. పోలీసుల తరఫున వాదనలకు హాజరైన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జాయ్ టిర్కే, వీరంతా 2019 నాటి వీసా మాన్యువల్ విధానాలను పాటించలేదని స్పష్టం చేశారు.

టూరిస్ట్ వీసాలపై వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడం, సైట్ సీయింగ్, స్నేహితులు, బంధువులను కలుసుకోవడం వంటి పనులకు మాత్రమే పరిమితం కావాల్సి వుందని, స్వల్ప వ్యవధి యోగా కార్యక్రమాలకు, మెడికల్  ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చని, అంతవరకే పరిమితం కావాలని, మరే ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు.

More Telugu News