సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

27-05-2020 Wed 07:35
  • సమంతకు కోటి మంది ఫాలోవర్స్ 
  • సీక్వెల్స్ పనిలో ప్రముఖ దర్శకుడు
  • నాని సినిమా కోసం కోల్ కతా సెట్స్
Samantha on cloud nine as she gets ten million followers

*  టాలీవుడ్ హీరోయిన్లలో సమంతకున్న ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో కొత్త విషయాలు పంచుకుంటూ వుంటుంది. ఇప్పుడీ భామ ఇన్ స్టాగ్రాంలో కోటి మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. దీంతో ఆనందపడిపోతూ అభిమానులకు ఈ చిన్నది థ్యాంక్స్ చెప్పింది.
*  దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి ఓ ప్రత్యేకత వుంది. లవ్ స్టోరీ తీసినా, యాక్షన్ ఫిలిం తీసిన వాటిలో ఒక స్టయిల్ వుంటుంది. అలా గతంలో ఆయన తీసిన 'రాఘవన్', 'ఏ మాయ చేసావే', 'ఎంతవాడు గాని' చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు వీటికి సీక్వెల్స్ చేయడానికి ఆయన కథలు సిద్ధం చేసుకున్నాడట.  
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ప్రస్తుతం 'శ్యాం సింగ రాయ్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది కోల్ కతా నేపథ్యంలో రూపొందుతుందట. దాంతో అక్కడికి వెళ్లి ఇప్పుడు షూటింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, కోల్ కతా వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సెట్స్ వేస్తున్నారట.