Lawrence: లారెన్స్ నడుపుతున్న ట్రస్ట్ గృహంలో 20 మందికి కరోనా పాజిటివ్!

20 Gets Corona Positive in Lawrence Trust House
  • చెన్నైలోని అశోక్ నగర్ లో చారిటబుల్ ట్రస్ట్
  • లక్షణాలు కనిపించడంతో నమూనాల పరీక్ష
  • ట్రస్ట్ ను మూసివేసిన గ్రేటర్ చెన్నై అధికారులు
ప్రముఖ నటుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. చెన్నైలోని అశోక్ నగర్ లో ట్రస్ట్ ఉండగా, ఇక్కడ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు ట్రస్ట్ లో ఉన్నవారిలో 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

చెన్నైలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న పలువురిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారి నమూనాలు సేకరించి పరీక్షించగా, 20 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించిన గ్రేటర్ చెన్నై అధికారులు, ట్రస్ట్ గెస్ట్ హౌస్ ను మూసివేశారు. ఆ ప్రాంతంలో క్రిమి సంహారాలు చల్లి, ట్రస్ట్ హౌన్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.
Lawrence
Trust House
Corona Virus

More Telugu News