నీళ్ల కోసం సింహాల ఫ్యామిలీ... వీడియో ఇదిగో!

27-05-2020 Wed 06:22
  • ఆఫ్రికా అడవుల్లో తీసిన వీడియో
  • ట్విట్టర్లో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామన్
  • మరోసారి వైరల్ అవుతున్న వీడియో
Video Shosh Lion Not comes as Single

సింహం లాంటి జంతువులు కూడా తమ సమాజంలోనే మిగతా వాటితో కలసిమెలసి జీవిస్తాయనడానికి నిదర్శనం ఈ వీడియో. ఆఫ్రికాకు చెందిన లండొలోజి అనే అధికారి ఈ వీడియోను తొలుత షేర్ చేయగా, భారత ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుధా రామన్‌ దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇక ఈ వీడియోలో ఆడ సింహాలన్నీ నీళ్లు తాగుతూ ఉండగా, చివరిలో రెండు మగ సింహాలు దర్జాగా నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది. ఆఫ్రికా అడవుల్లో తీసిన ఈ వీడియో పాతదే అయినప్పటికీ, మరోసారి వైరల్ అవుతోంది. మరోసారి దాన్ని మీరు కూడా చూసేయండి.