Talasani: సినీ, టీవీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన తలసాని

  • లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతున్న వినోద రంగ కార్మికులు
  • నిత్యావసరాలు పంపిణీ చేయాలని తలసాని నిర్ణయం
  • మొత్తం 14 వేలమందికి సాయం చేయనున్న తలసాని
Talasani prepares to help cine and television industry workers

లాక్ డౌన్ ప్రకటించడంతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో వినోద పరిశ్రమ కూడా ఒకటి. తెలుగు సినీ పరిశ్రమతో పాటు బుల్లితెర రంగం కూడా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న సినీ, టీవీ కార్మికుల కోసం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. వారికి తన శక్తిమేర సాయం చేసేందుకు నడుం బిగించారు. వినోద రంగ కార్మికులకు భారీ ఎత్తున నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం నుంచి ఈ పంపిణీ కార్యక్రమం అమలు కానుంది. మొత్తం 14 వేల మంది కార్మికులకు సాయం అందించాలని తలసాని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన టాలీవుడ్ పెద్దలను కూడా కలిసినట్టు తెలుస్తోంది.

More Telugu News