లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ బికినీలతో నిరసన

26-05-2020 Tue 21:10
  • అమెరికాలో లాక్ డౌన్ కు వ్యతిరేకంగా నిరసనలు
  • వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన ఓ కళాకారిణి
  • మాస్కులతో తయారు చేసిన బికినీ ధరించి నిరసన
American woman protest with bikini

లాక్ డౌన్ తో జనాల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. స్వేచ్ఛగా తిరిగే వారికి కాళ్లు, చేతులు కట్టేసినట్టైంది. అమెరికాలో కూడా లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే, లాక్ డౌన్ ఎత్తేయాలంటూ అగ్రదేశంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, వాషింగ్టన్ కు చెందిన దవీద సాల్ అనే ఓ కళాకారిణి ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. మాస్కులతో తయారు చేసిన టూపీస్ బికినీని ధరించి నిరసన తెలిపింది. వెంటనే లాక్ డౌన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తన నిరసనపై ప్రజలు అభిప్రాయాలను తెలియజేయాలని కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.