టీటీడీపై రమణ దీక్షితులు సంచలన డిమాండ్

26-05-2020 Tue 21:02
  • శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్ జరగాలి
  • ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆడిట్ చేయాలి
  • జాతీయ స్థాయిలో ఆడిటింగ్ జరగాలి
Ramana Deekshithulu demands audit on TTD assets

తిరుమల మాజీ ప్రధాన అర్చకులు  రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై పూర్తి స్థాయిలో ఆడిట్ జరగాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఈరోజు వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్ జరగాలని చెప్పారు. తన డిమాండ్ ను బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్వీట్ చేశారు.