పదవులు తీయడానికి న్యాయస్థానానికి నిమిషం పట్టదు: వర్ల రామయ్య

26-05-2020 Tue 20:59
  • వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు
  • వైసీపీ నేతలు పదవులు చూసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారన్న వర్ల
  • న్యాయ వ్యవస్థకు కూడా కులాలు అంటగడుతున్నారని వెల్లడి
Varla Ramaiah says its a matter of one minute for High Court

న్యాయమూర్తులపై వ్యాఖ్యల పర్యవసానంగా పలువురు వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్ లేకుండా పోయేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు పదవులు చూసుకుని మాట్లాడుతున్నారని వర్ల విమర్శించారు. పదవులు తీయడానికి న్యాయస్థానానికి నిమిషం పట్టదని స్పష్టం చేశారు. చివరికి న్యాయ వ్యవస్థకు కూడా కులాలు అంటగట్టే స్థాయికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు.