ఇలా ఆన్ లైన్ లో మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు: మోహన్ బాబు

26-05-2020 Tue 18:56
  • తమ విద్యార్థులకు సందేశం అందించిన మోహన్ బాబు
  • ఆన్ లైన్ లో విద్యాబోధన జరుగుతోందని వెల్లడి
  • ఎవరూ క్లాసులు మిస్ కావొద్దని సూచన
Mohan Babu message to Sree Vidyaniketan students

కరోనా రక్కసి పట్ల ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ విధించడంతో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రనటుడు మోహన్ బాబు తమ శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థులకు సందేశం అందించారు. షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అయితే, తమ విద్యార్థులతో ఇలా ఆన్ లైన్ లో మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఏం జరిగిందో అందరికీ తెలుసని, అందుకే విద్యార్థులు నష్టపోకుండా ఆన్ లైన్ లో విద్యాబోధన సాగిస్తున్నామని చెప్పారు. విద్యార్థులెవరూ క్లాసులు మిస్ కావొద్దని మోహన్ బాబు స్పష్టం చేశారు.

నిన్న జరిగింది గుర్తుంచుకోండి, ఇవాళ్టి పని రేపటికి వాయిదా వేయకండి, రేపటి సంగతి ఆలోచించవద్దు అంటూ విద్యార్థులకు హితవు పలికారు. ఎప్పటి పాఠాలు అప్పుడే నేర్చుకోవాలని సూచించారు. భావిభారత పౌరులు మీరు, ఇది తెలుసుకుని ముందుకు కదలండి... మనం త్వరలోనే కలుసుకుందాం అంటూ సందేశం అందించారు.