బాలకృష్ణకు పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసిన దర్శకుడు!

26-05-2020 Tue 17:30
  • 'సరిలేరు నీకెవ్వరూ'తో అనిల్ కు హిట్
  • ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ లతో ఎఫ్ 3
  • ఆ తర్వాత సినిమాగా బాలకృష్ణ ప్రాజక్ట్    
Anil Ravipudi to direct Bala Krishna

కొంతమంది దర్శకులకు ఫలానా హీరోతో సినిమా చేయాలని కోరికగా వుంటుంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా అలాగే నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో కోరిక. అందుకోసం మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.

అయితే, ఇప్పటివరకు బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ రాలేదు. ఆ అవకాశం అనిల్ కు త్వరలో రానుంది. ఎందుకంటే, బాలకృష్ణకు సరిగ్గా సెట్ అయ్యే ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును అనిల్ సిద్ధం చేశాడట. లాక్ డౌన్ పూర్తవగానే బాలకృష్ణను కలసి ఆ కథను వినిపించి, ఓకే చేయించుకోవాలని ఆయన ఉత్సాహంగా వున్నాడు.

ఇటీవల మహేశ్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' వంటి హిట్ చిత్రాన్ని చేసిన అనిల్ ప్రస్తుతం 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చేసే పనిలో వున్నాడు. స్క్రిప్ట్ కూడా సిద్ధం అయింది. ఇందులో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తారు. ఇది కూడా ఎంటర్ టైనర్ జోనర్ లోనే సాగుతుందట. ఇక ఆ చిత్రం పూర్తవగానే బాలకృష్ణతో ప్రాజక్టును పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.