మీ సేవలు అమోఘం... పోలీసులకు నీరాజనాలు సమర్పించిన నాగార్జున

26-05-2020 Tue 17:16
  • తమిళ కార్మికులకు గుంతకల్ వద్ద ఆహారం అందించిన ఏపీ పోలీస్
  • వేనోళ్ల కొనియాడిన ఐపీఎస్ అధికారుల సంఘం
  • నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్న నాగార్జున
Nagarjuna appreciates AP Police service towards needy

శ్రామిక్ రైలులో చెన్నై వెళుతున్న వెయ్యి మందికిపై తమిళనాడు వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ అనంతపురం జిల్లా ఎస్పీ ఏసు బాబుకు సమాచారం అందించగా, ఈ విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించి గుంతకల్ వద్ద వలస కార్మికులందరికీ ఆహారం అందించారు.

ఈ విషయాన్ని ఐపీఎస్ అసోసియేషన్ వేనోళ్ల కొనియాడింది. దీనిపై టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున స్పందిస్తూ, భారత పోలీసులకు నీరాజనాలు అంటూ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందు నిలిచి పోరాడుతున్న మీరు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. "ఏపీ పోలీస్... మీరు ప్రజలను రక్షించడమే కాదు, ప్రజల పట్ల సేవభావంతో వ్యవహరిస్తున్నారు. మీ సేవలు నిరుపమానం" అంటూ అభినందించారు.