డిస్కవరీ చానల్ కార్యక్రమం కోసం ప్రకాశ్ రాజ్ గాత్రం... 'ఎదురుచూస్తుంటాం' అన్న మహేశ్ బాబు!

26-05-2020 Tue 17:04
  • డిస్కవరీ చానల్లో వైల్డ్ కర్ణాటక కార్యక్రమం
  • జూన్ 5న రాత్రి 8 గంటలకు ప్రసారం
  • నేపథ్య గాత్రం అందించిన ప్రకాశ్ రాజ్
Prakash lends his voice for Wild Karnataka

ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన డిస్కవరీ చానల్లో ప్రసారమయ్యే 'వైల్డ్ కర్ణాటక' అనే కార్యక్రమం కోసం గొంతు అరువిచ్చారు. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ లో రూపుదిద్దుకున్న ఆ కార్యక్రమం జూన్ 5 శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. తమిళం, తెలుగు భాషల్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ చెబుతుండగా, డిస్కవరీ చానల్ ప్రోమో రిలీజ్ చేసింది. దీనిపై స్పందించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, "మీ ఆసక్తికర వర్ణన కోసం ఎదురుచూస్తుంటాం, ప్రకాశ్ రాజ్ ఇక కానిచ్చేయండి" అంటూ ట్వీట్ చేశారు.