ఏపీలో తాజా లాక్ డౌన్ సడలింపులు ఇవే!

26-05-2020 Tue 16:20
  • వస్త్ర, ఆభరణాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి
  • పెద్ద దుకాణాల్లో షాపింగ్ కు ముందస్తు బుకింగ్
  • వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూమ్స్ కు అనుమతి నిరాకరణ
AP loosen some lock down rules as cloth and jewellery shops gets nod

ఏపీలో తాజాగా మరికొన్ని లాక్ డౌన్ సడలింపులు, మార్గదర్శకాలు ప్రకటించారు. వస్త్ర, ఆభరణాల దుకాణాలు తెరుచుకోవచ్చంటూ  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే, విధిగా కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

 పెద్ద దుకాణాల్లో షాపింగ్ కు ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూమ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక, ఆభరణాల దుకాణాల్లో డిస్పోజబుల్ గ్లోవ్స్ ఉండాలని తెలిపారు. తోపుడు బళ్లపై ఆహార పదార్థాలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని స్పష్టం చేశారు. వీధి బళ్లపై అమ్మే ఆహారాన్ని అక్కడే తినకుండా చూడాలని, పార్శిల్ ఇవ్వాలని సూచించారు. అయితే, పానీ పూరీ బండ్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.