లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

26-05-2020 Tue 16:19
  • 63 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 10 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 5.71 శాతం నష్టపోయిన ఎయిర్ టెల్
Sensex ends 63 points low

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత మార్కెట్లు ఒక శాతం వరకు పెరిగాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 30,609కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 9,029 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (5.14%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.64%), నెస్లే ఇండియా (2.85%), ఎన్టీపీసీ (2.37%), మారుతి సుజుకి (2.20%).      

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-5.71%), టీసీఎస్ (-3.74%), బజాజ్ ఫైనాన్స్ (-3.48%), సన్ ఫార్మా (-2.16%), టెక్ మహీంద్రా (-1.83%).