డాక్టర్ సుధాకర్ కేసులో సుప్రీం మెట్లెక్కనున్న ఏపీ సర్కార్

26-05-2020 Tue 15:52
  • డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
  • ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • డాక్టర్ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ విచారణలో తేలిన వైనం
AP govt to appeal Doctor Sudhakars case in Supreme Court

వైజాగ్ డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ పై జరిగిన పోలీసు దాడిని హైకోర్టు తీవ్రంగా తీసుకుంది. దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి, ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ ఒంటిపై గాయాలు లేవని ఉందని... తాజాగా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో సుధాకర్ శరీరంపై గాయలున్నాయని ఉందని... అందుకే దీని వెనుక కుట్ర ఉన్నట్టు హైకోర్టు భావించింది. అనుమానాలు ఉన్నందువల్లే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది.