పోలీస్ అకాడమీలో మిస్ ఫైర్.. ఇన్స్ పెక్టర్ తొడ నుంచి దూసుకుపోయిన బుల్లెట్

26-05-2020 Tue 15:33
  • ట్రైనీ ఎస్సైలు శిక్షణలో ఉన్న సమయంలో ప్రమాదం
  • షూటింగ్ శిక్షణలో పేలని తుపాకీ
  • సరిచేస్తుండగా దూసుకొచ్చిన బుల్లెట్
Miss fire in Telangana Police Academy

హైదరాబాదులోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ట్రైనీ ఎస్సైలు శిక్షణలో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించింది. షూటింగ్ కు సంబంధించిన ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో... ఓ మహిళా ఎస్సై వాడుతున్న తుపాకీ పేలలేదు.

ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో... ఆ తుపాకీని పక్కనే ఉన్న ఇన్స్ పెక్టర్ వినోద్ దగ్గరకు ఆమె తీసుకెళ్లారు. తుపాకీని సరిచేస్తున్న సమయంలో దాన్నుంచి తూటా దూసుకొచ్చింది. ఆయన తొడ భాగం గుండా దూసుకెళ్లి, బయటకు వచ్చింది. గాయపడిన వినోద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు.