హైదరాబాద్ ఎల్బీనగర్ లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

26-05-2020 Tue 15:32
  • ఉస్మానియా డెంటల్ కాలేజీలో చదువుతున్న సాహితి
  • 14వ అంతస్తు నుంచి దూకిందంటున్న కుటుంబ సభ్యులు
  • అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
Medical student suspicious death in LB Nagar

హైదరాబాద్ లో సాహితి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఎల్బీ నగర్ లోని అలేఖ్య టవర్స్ 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలేఖ్య ఉస్మానియా డెంటల్ కాలేజీలో చదువుతోంది.

ఆమె తల్లిదండ్రులు రఘురాం, పద్మ. కాగా, సాహితి ఈ మధ్యాహ్నం తమ నివాసంలోని బాల్కనీ గ్రిల్స్ తొలగించి కిందికి దూకినట్టు చెబుతున్నారు. ఎంబీబీఎస్ లో సీటు రాకపోవడంపై సాహితి మనస్తాపానికి గురైందని అంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.