వాటికంటే ఐటెం సాంగులే బెటర్: హంసా నందిని

26-05-2020 Tue 14:07
  • హీరోయిన్ గా రొటీన్ పాత్రలే వచ్చాయి
  • ఆ పాత్రలు నచ్చకే ఐటెం సాంగుల వైపు మళ్లాను
  • ఐటెం సాంగులు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి
Item songs are better than heroine characters says Hamsa Nandini

కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ పాత్రలు చేసిన హంసానందిని ఆ తర్వాత ఐటెం సాంగులకు పరిమితమైంది. ఎన్నో సినిమాల్లో తన ఐటెం సాంగుల ద్వారా ఆమె ప్రేక్షకులను మైమరపించింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో మచ్చటిస్తూ ఐటెం సాంగ్స్ పై స్పందించింది.

హీరోయిన్ గా రొటీన్ పాత్రలే తనకు వచ్చాయని... ఆ పాత్రలు తనకు నచ్చకపోవడంతో, ఐటెం సాంగ్స్ వైపు మళ్లానని చెప్పింది. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెం సాంగులే బెటర్ అని తెలిపింది. స్పెషల్ సాంగులు రొటీన్ కు భిన్నంగా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని తెలిపింది. మరోవైపు హంసానందిని తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది. మహారాష్ట్రలో జన్మించిన హంసానందిని అసలు పేరు పూనమ్. సినీ పరిశ్రమలోకి వచ్చాక ఆమె తన పేరును మార్చుకుంది.