పొలాలపై పడుతున్న మిడతల దండు.. తరిమికొడుతున్న రైతుల సౌండు!

26-05-2020 Tue 13:32
  • మధ్యప్రదేశ్‌లోని బుధ్నిలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తోన్న రైతులు
  • పంటపొలాల్లో పిచికారీ
  • పలు పద్ధతులు పాటిస్తూ మిడతల నుంచి రక్షణ
 Madhya Pradesh Farmers in Budhni and Nasrullaganj of Sehore district beat

ఇటీవల రాజస్థాన్‌లో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ప్రవేశించాయి. దీంతో పలు ప్రాంతాల రైతులను ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అధికారుల సూచనల మేరకు మిడతలను తరిమికొట్టేందుకు రైతులు పలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మిడతల దాడి మొదలైన బుధ్నిలోని పొలాల్లో పెద్దగా శబ్దాలు చేస్తూ పొలాల వద్ద పలు చర్యలు తీసుకుంటున్నారు.

అంతేగాక, అవి ఏ దిశగా వెళుతున్నాయన్న విషయాన్ని కూడా గుర్తించి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అలాగే, మిడతల తాకిడి ఉన్న పొలాల పరిసరాల్లో రసాయనాలను పిచికారి చేస్తున్నారు. ఈ మిడతలను నియంత్రించలేకపోతే కోట్లాది రూపాయల విలువైన పెసర పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.