వైసీపీ గూటికి చేరనున్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు

26-05-2020 Tue 13:03
  • టీడీపీకి షాక్ ఇవ్వనున్న సాంబశివరావు, అనగాని
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం
  • టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన బాలినేని
Two TDP MLAs to join YSRCP

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ గూటికి చేరారు. తాజాగా టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపి... వైసీపీలో చేరేందుకు ఒప్పించారు.