ప్రపంచంలో ఇలాంటి దేశం భారత్‌ ఒక్కటే.. అందుకే కరోనా తీవ్రతరమవుతోంది: రాహుల్ గాంధీ

26-05-2020 Tue 12:51
  • కరోనా  పెరిగిపోతోన్న సమయంలో నిబంధనలు సడలించారు
  • దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం కాదు
  • మరింత పెరుగుతున్నాయి
  • లాక్‌డౌన్‌ అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం
  • సరిహద్దుల్లోనూ ఇతర దేశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి
Rahul Gandhi attacks Centre

కరోనా తీవ్ర స్థాయిలో పెరిగిపోతోన్న సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటేనని, అందుకే కరోనా తీవ్రతరమవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు.

'దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం కాదు.. మరింత పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. లాక్‌డౌన్‌ లక్ష్యం, ఉద్దేశం నెరవేరలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒంటరిగా పోరాటం చేశాం' అని రాహుల్ గాంధీ చెప్పారు.

'ఇతర దేశాలతో సరిహద్దు సమస్యలపై ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇటువంటి పరిస్థితులకు కారణాలేంటీ? దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం దేశానికి పూర్తి పారదర్శకంగా వివరాలు వెల్లడించాలి. నేపాల్ సరిహద్దుల వద్ద ఏం జరుగుతోంది? లడఖ్‌లో ఏం జరుగుతోంది?' అని రాహుల్ ప్రశ్నించారు.