సమయం వచ్చినప్పుడు స్పందిస్తా: గంటా శ్రీనివాసరావు

26-05-2020 Tue 12:44
  • భక్తులు ఇచ్చిన భూములను అమ్మడం సరికాదు
  • టీటీడీ భూములను కాపాడాలి
  • ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు కలుస్తారు
Stop selling TTD Lands says Ganta Srinivas

వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, జగన్ ఏడాది పాలనపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. మంత్రి అవంతి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా సమయం వచ్చనప్పుడు మాట్లాడతానని అన్నారు.

 తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన భూములను కాపాడాలని అన్నారు. దేవుడి కోసం భక్తులు ఇచ్చిన భూములను అమ్మడం సరికాదని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా దేవుడి భూములను అమ్మడం కరెక్ట్ కాదని తెలిపారు.

ఎల్జీ పాలిమర్స్ బాధితులను మహానాడు తర్వాత తమ అధినేత చంద్రబాబు పరామర్శిస్తారని చెప్పారు. విశాఖ 42వ వార్డులో పేదలకు నిత్యావసర వస్తువులను గంటా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ  కార్యక్రమానికి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.