మతిస్థిమితం కోల్పోయిన కుర్రాడు.. పెద్ద మనసు చాటుకున్న పోలీసులు .. వీడియో ఇదిగో!

26-05-2020 Tue 12:36
  • విజయనగరంలో ఘటన
  • మతిస్థిమితం లేని కుర్రాడికి స్నానం చేయించిన పోలీసులు
  • కొత్త షర్ట్ తొడిగి అనాథాశ్రమంలో చేర్పించిన వైనం 
ap police service

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో సేవలందిస్తోన్న పోలీసులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ మతిస్థిమితం లేనివారికి, యాచకులకు సాయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా, మతి స్థిమితం లేక రోడ్డు ప్రక్కన పందులతో సహవాసం చేస్తున్న కుర్రవాడికి స్నానం చేయించి, జుట్టు తీయించి, బట్టలు తొడిగారు విజయనగరం పోలీసులు.

అనంతరం అతడిని హోయినా అనాథాశ్రమంలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ఏపీ పోలీసుల ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కరోనాపై ఏపీ పోలీసులు పోరాడుతున్నారని తెలిపారు.