ధర్మ పరిరక్షణ కోసం దీక్షలు కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

26-05-2020 Tue 11:50
  • బీజేపీ నేతలతో పాటు జనసేన నేతల ఉపవాస దీక్షలు 
  • భూముల అమ్మకం ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది
  • అయినప్పటికీ ఉపవాస దీక్ష కొనసాగుతుంది 
GVL ysjagan governments claim that they are doing what the

తిరుమల శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయాలు తీసుకుంటోందంటూ బీజేపీ ఏపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తున్నారు.

దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ... 'టీటీడీ భూముల అమ్మకం ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నప్పటికీ ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్షని కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అని అన్నారు. ఈ రోజు ఉదయం  9 గంటలకు  బీజేపీతో కలిసి జనసేన ప్రారంభించిన ఈ దీక్షలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.
                
కాగా, తన నివాసం వద్ద తాను కూడా ఈ దీక్షల్లో పాల్గొంటున్నానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఉపవాస దీక్ష ప్రారంభించేముందు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఆయన పూజలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ఆలయ భూములను అమ్మాలనుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.