ఆయా ప్రాజెక్టుల వద్ద జల దీక్షలు చేపడతాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన

26-05-2020 Tue 11:37
  • ఒక్క కాళేశ్వరంపై టీఆర్‌ఎస్‌కు అంత ప్రేమ ఎందుకు?
  • లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకన్నా నీరిచ్చారా?
  • ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
  • జూన్ 2న కృష్ణా ప్రాజెక్టుల వద్ద, జూన్ 6న గోదావరి ప్రాజెక్టుల వద్ద దీక్షలు
uttam fires on trs

తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము జలదీక్షలు చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. 'కాంగ్రెస్ హయాంలో 85 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులు వదిలేసి ఒక్క కాళేశ్వరంపై అంత ప్రేమ ఎందుకు? లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకన్నా నీరిచ్చారా? గ్రావిటీతో వచ్చే నీటిని వదిలేసి ఎత్తిపోతలపై అంత శ్రద్ధ దేనికి?' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత, అసమర్ధ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్లతో తెలంగాణ కాంగ్రెస్ జూన్ 2న కృష్ణా ప్రాజెక్టుల వద్ద, జూన్ 6న గోదావరి ప్రాజెక్టుల వద్ద జల దీక్షలు చేపడుతుంది' అని తెలిపారు.