రామ్‌ గోపాల్‌ వర్మ కొత్త సినిమా నుండి మరో రెండు ఆసక్తికర పోస్టర్లు విడుదల

26-05-2020 Tue 10:10
  • 'కరోనా వైరస్' అనే సినిమా తీస్తోన్న వర్మ 
  • ఇంట్లో భౌతిక దూరం పాటిస్తున్నట్లు ఓ పోస్టర్‌
  • నవ్వులు పూయిస్తోన్న పోస్టర్లు
rgv new movie poster

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కరోనా వైరస్' అనే సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మరో రెండు ఆసక్తికర పోస్టర్లను ఆయన ఈ రోజు విడుదల చేశారు. 'కరోనా వైరస్‌ సినిమా నుంచి కుటుంబ దూరం పిక్ విడుదల చేస్తున్నాను. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ గురించి ఈ సీను తీశాను' అని ఆయన చెబుతూ ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పోస్ట్ చేశారు.
 
ఇందులో ఓ కుటుంబం తమ ఇంట్లో భోజనం చేస్తుంటుంది. అయితే, అందరూ ఒక్కచోట కూర్చొని తినకుండా భౌతిక దూరం పాటిస్తూ భోజనం చేస్తుంటారు. ఒక్కరు మాత్రమే డైనింగ్‌ టేబుల్‌ వద్ద కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుండగా మిగతా వారంతా నిలబడి తింటుంటారు. నవ్వులు పూయించేలా ఈ పోస్టర్ ఉంది. మరో పోస్టర్‌లో ఇద్దరు మాస్కులు పెట్టుకుని ఇంట్లో జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఉంది.