బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ ఇంట్లో ఇద్దరికి కరోనా.. అందరూ ఐసోలేషన్‌లో!

26-05-2020 Tue 09:56
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కరణ్ జొహార్
  • బాధితులు ఇద్దరినీ తన ఇంట్లోనే క్వారంటైన్ చేశామన్న నిర్మాత
  • వారు త్వరగా కోలుకుంటారని ఆశాభావం
Karan Johar confirms two members of household staff test positive

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ ఇంటిలో పనిచేస్తున్న వారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అయితే, కుటుంబ సభ్యులకు కానీ, మిగతా సిబ్బందికి కానీ ఎవరికీ వైరస్ సోకలేదని కరణ్ జొహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. కరోనా సోకిన ఇద్దరినీ తన ఇంటిలోనే హోం క్వారంటైన్‌లోనే ఉంచామని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపాడు. వారికి చికిత్స అందిస్తున్నామని, త్వరగానే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

సిబ్బందికి కరోనా అని నిర్ధారణ అయిన వెంటనే అధికారులకు సమాచారం అందించామని, మునిసిపల్ సిబ్బంది వచ్చి తమ ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేశారని పేర్కొన్నాడు. అధికారుల ఆదేశాల ప్రకారం తామందరం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటామన్నాడు. అందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.