దేశంలో 24 గంటల్లో మరో 6,535 మందికి కరోనా నిర్ధారణ

26-05-2020 Tue 09:22
  • మొత్తం కేసులు 1,45,380
  • మృతుల సంఖ్య మొత్తం 4,167
  • 80,722 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 60,490 మంది
 Coronavirus India cases

భారత్‌లో కరోనా వైరస్ కేసులు ప్రతిరోజు 6,000పైగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,535 మందికి కొత్తగా కరోనా సోకగా, 146 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,45,380కి చేరగా, మృతుల సంఖ్య 4,167కి చేరుకుంది. 80,722 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 60,490 మంది కోలుకున్నారు.