శ్రీకాకుళం జిల్లాలో వలస కార్మికులతో వెళుతున్న బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు

26-05-2020 Tue 09:04
  • ప్రమాద సమయంలో బస్సులో 42 మంది
  • బాధితులందరూ పశ్చిమ బెంగాల్ వారే
  • కర్ణాటక నుంచి వస్తుండగా ఘటన
33 Migrant workers injured in road accident in Srikakulam dist

శ్రీకాకుళం జిల్లాలో 42 మంది వలస కూలీలతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. మందస మండలం బాలిగాం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితులందరూ కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.