Puja Hegde: ఇటు తెలుగు.. అటు హిందీలో ముద్దుగుమ్మ బిజీ

Pooja Hegde busy with Bollywood and Tollywood films
  • గ్లామరస్ హీరోయిన్ గా పూజాకు డిమాండ్ 
  • హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు
  • తెలుగులో సెట్స్ పై రెండు సినిమాలు
  • దుల్ఖర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్  
టాలీవుడ్ లో పూజా హెగ్డే ఇప్పుడు బాగా డిమాండ్ వున్న కథానాయిక!
వరుస హిట్లతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. గ్లామర్ పాత్రలకు  కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. దీంతో ఆటోమేటిక్ గానే అమ్మడి పారితోషికం కూడా పెరిగిపోయింది. అయినప్పటికీ, పూజానే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం చూస్తున్నారు.

ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు కమిట్ అయింది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే 'కబీ ఈద్ కబీ దివాలీ' సినిమాలోను, అక్షయ్ కుమార్ నటించే 'బచ్చన్ పాండే' చిత్రంలోనూ హీరోయిన్ గా నటించడానికి పూజ ఇప్పటికే డేట్స్ ఇచ్చేసింది.

ఇక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ చిత్రంలోనూ, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా దుల్ఖర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని అశ్వనీదత్ కూతుర్లు స్వప్నా దత్, ప్రియాంక దత్ కలసి నిర్మిస్తారు. ఇలా పూజ హెగ్డే ప్రస్తుతానికి అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉందన్నమాట!
Puja Hegde
Prabhas
Akhil
Salman Khan
Akshay Kumar

More Telugu News