తిరుమల ఘాట్‌ రోడ్డులో కనిపించిన అరుదైన దేవాంగ పిల్లులు

26-05-2020 Tue 08:45
  • గుర్తించి అధికారులకు సమాచారం అందించిన నిర్మాణ కార్మికులు
  • అరుదైన దేవాంగ పిల్లులుగా గుర్తించిన అధికారులు
  • శేషాచలం అటవీ ప్రాంతంలో నివాసం
Rare Cats Found in Tirumala Ghat Road

తిరుమల ఘాట్‌ రోడ్డులో నిన్న అరుదైన రెండు పిల్లులు కనిపించాయి. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు చివరి మలుపు సమీపంలో కనిపించిన ఈ రెండు పిల్లులను దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. కార్మికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని అక్కడే ఉంచారు. అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు శేషాచలం అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు.