సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-05-2020 Tue 07:22
  • ఆన్ లైన్ కోర్సులలో కాజల్ బిజీ 
  • సీన్లు ప్రాక్టీస్ చేయిస్తున్న దర్శకుడు
  • బన్నీ సినిమాలో సుమ లేదట!
Kajal learning online courses

*  జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒత్తిడికి గురి కాలేదని చెబుతోంది అందాలభామ కాజల్ అగర్వాల్. 'ఎలాంటి కష్టాలొచ్చినా ఒత్తిడికి లోనవను. సావధానంగా ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా అంతే.. ఈ లాక్ డౌన్ లో ఏమాత్రం ఒత్తిడి పడడం లేదు. ఆన్ లైన్లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నాను.. ఇష్టమైన బుక్స్ చదువుకుంటున్నాను.. అప్పుడప్పుడు వంట చేస్తున్నాను. ఇలా బిజీగా వుంటే ఒత్తిడి అన్నదే రాదు' అని చెప్పింది.  
*  కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా 'చావు కబురు చల్లగా' చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినా చిత్ర దర్శకుడు కౌశిక్ మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడట. ఆన్ లైన్లో హీరో హీరోయిన్లకు స్క్రిప్టు చదివి వినిపిస్తూ, కొన్ని సీన్లు ముందుగానే ప్రాక్టీస్ చేయిస్తున్నాడట.  
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టుగా ఇటీవల వార్తలొస్తున్నాయి. అయితే, చిత్రం యూనిట్ తాజాగా వీటిని ఖండించింది. సుమ ఈ చిత్రంలో నటిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఈ రూమర్లను ఎవరు పుట్టించారో తెలియడం లేదని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.