కాలికి అనుమానాస్పద రింగ్ తో పాక్ నుంచి భారత్ వచ్చిన పావురం

25-05-2020 Mon 22:05
  • రింగ్ పై సంకేతాక్షరాలు
  • సరిహద్దు వద్ద గ్రామస్తులకు దొరికిన పావురం
  • పోలీసులకు అప్పగింత
Pigeon caught by people in Jammu and Kashmir

గూఢచర్యంలో పాకిస్థాన్ జిత్తులమారితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ పావురం పాక్ వైపు నుంచి భారత్ లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఆ పావురం కాలికి అనుమానాస్పద రీతిలో ఓ రింగ్ తొడిగి ఉంది. ఆ రింగ్ పై కొన్ని సంకేతాక్షరాలు ఉండడంతో అది కచ్చితంగా గూఢచర్యంలో భాగం అయ్యుంటుందని భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో మన్కారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సరిహద్దు వద్ద పావురాన్ని పట్టుకున్న గ్రామస్తులు దాన్ని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు పావురం కాలికి ఉన్న రింగ్ ను పరిశీలిస్తున్నారు. రింగ్ ఉన్న కోడ్ లాంగ్వేజిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.