శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో అవినీతి బాగోతం... విచారణకు ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి

25-05-2020 Mon 21:37
  • దర్శన, ఆర్జిత టికెట్లు అమ్మకాల్లో కుంభకోణం
  • ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం!
  • కర్నూలు జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి
Darshan tickets scam in Srishailam

సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆలయ దర్శన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల్లో కుంభకోణం జరిగినట్టు వెల్లడైంది. బ్యాంకుల తరఫున పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది రూ.1.40 కోట్ల మేర చేతివాటం ప్రదర్శించినట్టుగా భావిస్తున్నారు. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ, వెంటనే నగదు రికవరీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన కర్నూలు జిల్లా ఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రత్యేక అధికారిని నియమించి, సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా, అంతర్గత ఆడిట్ రిపోర్ట్ సహా అవినీతి కుంభకోణంపై నివేదిక ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు.