తెలంగాణలో ఇవాళ కరోనాకు ముగ్గురి బలి!

25-05-2020 Mon 21:27
  • రాష్ట్రంలో 56కి పెరిగిన మరణాలు
  • ఇవాళ కొత్తగా 66 కేసులు
  • 72 మంది డిశ్చార్జి
Three persons died today in Telangana due to corona virus

తెలంగాణలో కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. ఇవాళ మూడు మరణాలు సంభవించగా, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 56కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 31 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదైంది. 15 మంది వలస కార్మికులు, 18 మంది విదేశాల నుంచి వచ్చినవారు, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒకరు కరోనా బారినపడ్డట్టు తాజాగా గుర్తించారు. దాంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,920కి చేరింది. ఇక, ఇవాళ 72 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్నవారి సంఖ్య 1,164కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 700 మంది చికిత్స పొందుతున్నట్టు అధికారిక బులెటిన్ లో పేర్కొన్నారు.