ఇద్దరు సీఎంల కుట్రలు ప్రజలకు వివరించేందుకు ముందుకు రావాలని పవన్ ను కోరా: బండి సంజయ్

25-05-2020 Mon 21:02
  • ఈ సాయంత్రం పవన్ ను కలిసిన సంజయ్
  • తాజా పరిణామాలపై చర్చ
  • కలిసి పనిచేసేందుకు పవన్ సంసిద్ధత వ్యక్తం చేశారని వెల్లడి
Bandi Sanjay talks about his meeting with Pawan Kalyan

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సాయంత్రం హైదరాబాదులో జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ముప్పావు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు తాజా అంశాలపై చర్చించినట్టు బండి సంజయ్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల సీఎంల కుట్రలను ప్రజలకు వివరించేందుకు కలిసి రావాలని పవన్ ను కోరినట్టు వెల్లడించారు.

ఇక తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్ సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ శ్రీవారి ఆస్తుల అమ్మకంపైనా స్పందించారు. టీటీడీ ఆస్తులను అమ్ముతామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తులను అమ్మే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్వామివారి ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.