కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం ఇలా..!: కొత్త చిత్రం నుంచి పిక్ రిలీజ్ చేసిన వర్మ

25-05-2020 Mon 19:51
  • 'కరోనా వైరస్' పేరిట వర్మ కొత్త సినిమా
  • లాక్ డౌన్ కాలంలో తెరకెక్కించినట్టు వెల్లడి
  • రేపు సాయంత్రం ట్రైలర్
RGV releases a pic from his new movie Coronavirus

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కరోనా వైరస్' పేరిట కొత్త చిత్రం తీసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కాలంలోనే తెరకెక్కించానని వెల్లడించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పిక్ ను షేర్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం ఇలా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఆ పిక్ లో దంపతులు బెడ్రూంలో కూడా మాస్కులు ధరించి ఎంతో ఎడంగా కూర్చుని ఉండడం చూడొచ్చు. మొత్తమ్మీద వర్మ సినిమా తీయడమే కాదు ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు. రేపు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.