సాయితేజ్... ఈ పాట నీ పెళ్లిలో పాడతా!: రాశీ ఖన్నా

25-05-2020 Mon 18:44
  • సాయితేజ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం
  • నా పెళ్లి అనే సాంగ్ రిలీజ్
  • పాట చాలా బాగుందన్న రాశి 
Raashi Khanna says that she will sing Naa Pelli song in Sai Tej wedding

యువ హీరో సాయితేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం నుంచి 'నా పెళ్లి' అనే సాంగ్ ను హీరో నితిన్ రిలీజ్ చేయడం తెలిసిందే. ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఈ సాంగ్ లో వరుణ్ తేజ్, రానా కూడా కనిపించడంతో మరింత హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో, క్యూట్ హీరోయిన్ రాశీ ఖన్నా ట్విట్టర్ లో స్పందించింది.

 "సాయితేజ్, ఈ పాట చాలా బాగుంది... నీ పెళ్లిలో పాడతాను" అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు, సంగీతం అందించిన తమన్ ను కూడా అభినందించింది. కాగా, సుబ్బు డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో సాయితేజ్ సరసన నభా నటేశ్ హీరోయిన్ గా నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణసారథ్యంలో తెరకెక్కిన ఈ ఎంటర్టయినర్ మూవీని లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేయనున్నారు.