జూలై నుంచి షూటింగుకి పవన్ కల్యాణ్

25-05-2020 Mon 17:33
  • గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్'
  • బాలీవుడ్ సినిమా 'పింక్'కి రీమేక్ 
  • లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • జూలై నుంచి షూటింగ్ ప్లానింగ్  
Pawan to join his shooting from July

అసలు కరోనా వైరస్ మన దేశంలోకి రాకుండా వుండివుంటే కనుక.. ఈ లాక్ డౌన్ పరిస్థితులు లేకుండా ఉన్నట్టయితే కనుక ఈ పాటికి పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన కొత్త సినిమా 'వకీల్ సాబ్'ను ఎంజాయ్ చేస్తూవుండేవారు. పవన్ చాలా కాలం తర్వాత నటిస్తున్న ఆ సినిమా నిర్మాణం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తయి ఉన్నట్టయితే, ఈ నెల 15న ఆ చిత్రాన్ని విడుదల చేసివుండేవారు. అయితే, కరోనా మహమ్మారి భయకంపితులను చేస్తుండడం వల్ల లాక్ డౌన్ పడడం.. దరిమిలా థియేటర్లు మూతపడడం జరిగింది.

ఇక ఇప్పుడు ఒక్కొక్కటీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి సినిమా షూటింగులు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగును మాత్రం జూలై నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చాకనే షూటింగును పెట్టుకుందామని పవన్ నిర్మాతకు చెప్పారట. దాంతో జూలై నుంచి ఈ షూటింగ్ మొదలవ్వచ్చు. బాలీవుడ్ లో హిట్టయిన 'పింక్'కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీరాం వేణు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.