ఈ సాయంత్రం పవన్ కల్యాణ్ తో భేటీ కానున్న బండి సంజయ్!

25-05-2020 Mon 16:35
  • సాయంత్రం 6 గంటలకు సమావేశం
  • తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పనిచేయడంపై చర్చ
  • రెండు పార్టీలను బలోపేతం చేయడంపైనా చర్చ
Telangana BJP chief Bandi Sanjay to meet Pawan Kalyan

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ సాయంత్రం జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరిద్దరి సమావేశం జరగనుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పనిచేయడంపై సమాలోచన చేయనున్నారు. ఇరు పార్టీలను మరింత బలోపేతం చేయడంపైనా చర్చించనున్నారు.

బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందుకున్న తర్వాత తొలిసారి పవన్ ను కలుస్తున్నారు. దాంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై అనవసర విమర్శలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు. ఇంకెన్ని రోజులు ఈ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.